Eluru: ఏలూరులో జెడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Eluru: ఏలూరు జిల్లాలో నవంబర్ 5న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, 7న కౌంటింగ్. భీమడోలులో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2026 11:10 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో జెడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ఏలూరు: ఏలూరు జిలాల్లో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అప్రమత్తతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.భీమడోలులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన పోలింగ్ సిబ్బందికి ఏర్పాటుచేసిన పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రంలో పోలింగ్ పరికరాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు.

అక్కడ సిబ్బందిని పలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 27 జెడ్పిటిసి లు,454 ఎంపిటిసి స్థానాలకు ఈనెల 5వ తేదీన పోలింగ్,7వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో సిబ్బంది బ్యాలెట్ బాక్సులు,బ్యాలెట్ పేపర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు.

పోలింగ్ ప్రక్రియపై సిబ్బందికి 2సార్లు శిక్షణ అందించడం జరిగిందని,పోలింగ్ పరికరాలతోపాటు,వాహనాలలో పోలింగ్ స్టేషన్ కి పంపడం జరుగుతుందన్నారు.బస్సులో రూట్ అధికారిని కూడా పంపడం జరుగుతుందన్నారు.నవంబర్,5వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.

సాయంత్రం పోలింగ్ పూర్తి అయినవెంటనే బ్యాలెట్ బాక్సులను బ్యాలెట్ పత్రాలతో జాగ్రత్తగా స్ట్రాంగ్ రూంలకు చేర్చాలన్నారు.పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం పరిసరాలలో న్యూసెన్స్ సృష్టిస్తే వెంటనే పోలీసు సిబ్బందికి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి,ఎంపిడిఓవివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్