Kukunoor: కుక్కునూరుకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి: CPM
Kukunoor: కుక్కునూరు మండలంలో విద్యుత్ కోతలను నివారించి నిరంతర సరఫరా అందించాలని, సీలేరు విద్యుత్ లైన్ పనులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Kukunoor: కుక్కునూరుకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి: CPM
కుక్కునూరు: ముంపు మండలమైన కుక్కునూరులో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు.
జంగారెడ్డిగూడెం నుంచి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు నిత్యజీవితంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీలేరు–కూనవరం–పోలిపాక మీదుగా విద్యుత్ లైన్ ఏర్పాటు ప్రతిపాదనపై గతంలో సర్వే నిర్వహించినప్పటికీ, దాని ప్రస్తుత స్థితి, నిధుల కేటాయింపు, పనుల ప్రారంభంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సర్వేలు, హామీలకే పరిమితం కాకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ఈ ప్రకటనలో పాల్గొన్నారు.




