Kukunoor: అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యోగి అనుమానాస్పద మృతి!
Kukunoor: అటవీ రేంజ్ కార్యాలయంలో 17 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న మేడి సత్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Kukunoor: అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యోగి అనుమానాస్పద మృతి!
కుకునూర్: తాత్కాలిక ఉద్యోగి అనుమానస్పద స్థితిలోమృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన కథనం మేరకుఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన మేడి సత్యనారాయణ (55) గత 17 సంవత్సరాలుగా కుక్కునూరు అటవీ రేంజ్ కార్యాలయంలో తాత్కాలిక అకౌంట్స్ / పేపర్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
సోమవారం అటవీ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అటవీ శాఖ అధికారులకు పులి సంచారం సమాచారం రావడంతో సమాచారం నిమిత్తం అటవీ శాఖ సిబ్బంది రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్లగా, రేంజ్ కార్యాలయంలో సత్య నారాయణ ఒంటరిగా పనిచేస్తున్నాడు.
మంగళవారం ఉదయం అటవీ రేంజ్ కార్యాలయానికివచ్చిన స్విపర్ ఆయన వచ్చి పక్కన నేలపై అపస్మార్క స్థితిలో పడి ఉండటానికి గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అనంతరం108 కి చరవాణి ద్వారా సమాచారం ఇవ్వగా, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, అప్పటికే అయన మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజా రెడ్డి తెలిపారు.
కుటుంబ పోషణ చూసుకునే సత్య నారాయణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. తోటి ఉద్యోగి మృతి చెందడంతో రేంజ్ కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




