Nuzvid: నూజివీడులో వైఎస్సార్‌సీపీ ముమ్మర ఎన్నికల ప్రచారం!

Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు. మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ నేతృత్వంలో చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవ్ కుమార్ ప్రచారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Oct 2026 10:29 AM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడులో వైఎస్సార్‌సీపీ ముమ్మర ఎన్నికల ప్రచారం!

Nuzvid: నూజివీడు పట్టణంలో స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల వేడి పీక్స్‌కు చేరింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.నూజివీడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,పార్టీ సీనియర్ నాయకులు మేకా.వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో పట్టణంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవ్ కుమార్ తో పాటు, వివిధ వార్డుల నుండి కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు,చైర్మన్ అభ్యర్థి లవ్ కుమార్ బృందం పట్టణంలోని ప్రతి వీధి,ప్రతి ఇల్లూ తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు.

ఈ సందర్భంగా పట్టణ ప్రజల నుంచి వారికి అపూర్వ స్పందన లభిస్తోంది.మహిళలు,వృద్ధులు,యువత ప్రతి వార్డులోనూ హారతులు పడుతూ,పూలమాలలతో అభ్యర్థులకు ఘన స్వాగతం పలుకుతున్నారు.ప్రజల నుంచి వస్తున్న ఈ భారీ మద్దతు చూస్తుంటే నూజివీడు మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టమవుతోంది.

ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నూజివీడు పట్టణ ప్రజలు ఎల్లప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని కొనియాడారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో నూజివీడు మున్సిపల్ చైర్మన్ పదవిని వైసిపి అత్యంత భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా పట్టణంలోని అత్యధిక వార్డుల్లో వైసిపి కౌన్సిలర్ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారని ఆయన స్పష్టం చేశారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉండేవని,సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రశాంతంగా జీవించగలిగారని ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు గుర్తుచేశారు.

కానీ ప్రస్తుత పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని,సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు.ఈ అడ్డూఅదుపూ లేని ధరల పెరుగుదలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని,ఎన్నికల ద్వారా వీరికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో అధికార పక్ష నేతలైన,మరెవరైనా గానీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని,ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం,మొహమాటం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

పట్టణ అభివృద్ధి నిరంతరాయంగా సాగాలన్నా, ప్రజా సంక్షేమం వర్ధిల్లాలన్నా రాబోయే ఎన్నికల్లో 'ఫ్యాన్' గుర్తుపై ఓటు వేసి వైసిపి చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవ్ కుమార్ ను, అలాగే పార్టీ వార్డు మెంబర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ పర్యటనలో స్థానిక వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్