Yetapaka: క్యాన్సర్ బాధితుడికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించిన ధనలక్ష్మి!

Yetapaka: గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ మహిళా నేత రేవతి భర్త రామారావు వైద్య చికిత్స నిమిత్తం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి రూ.4 లక్షల చెక్కును అందజేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Sept 2026 6:01 PM IST
Yetapaka
X

Yetapaka: క్యాన్సర్ బాధితుడికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించిన ధనలక్ష్మి!

ఎటపాక: వైఎస్ఆర్సిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దామెర్ల రేవతి భర్త దామెర్ల రామారావు ఇటీవల కాలంలో గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.సర్జరీ రేడియేషన్,కీమోలతో కలిపి సుమారు 8 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్ల తెలపారు.

ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన రేవతికి కష్టాన్ని గుర్తించి తక్షణ సహాయంగా నాలుగు లక్షల రూపాయల చెక్కును ధనలక్ష్మి కి ఇవ్వడం జరిగింది.

ఈరోజు ఉదయం ఎటపాక మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లతో కలిసి దామెర్ల రేవతి నివాసానికి వెళ్లి వారి భర్త రామారావుని పరామర్శించి అనంతరం నాలుగు లక్షల రూపాయల చెక్కుని అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు ( బుజ్జి,), గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి (ఎటపాక మండల సోషల్ మీడియా కమిటీ విభాగం అధ్యక్షులు) మండల మహిళా అధ్యక్షురాలు గుడిమల్ల నాగలక్ష్మి, జడ్పిటిసి ఉబ్బా సుస్మిత, ఎంపీపీ కాకా కామేశ్వరి,యువజన విభాగం మండల అధ్యక్షుడు తోట శశి కుమార్, పబ్లిసిటీ భాగం మండల అధ్యక్షుడు ముత్తి బోయిన రాము, ఎంపీటీసీ బోరం అంజలి, ఎంపీటీసీ కమల పురుషోత్తపట్నం గ్రామ కమిటీ అధ్యక్షుడు సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ, గుండాల గ్రామ కమిటీ అధ్యక్షుడు కాకాని సురేష్, ఆటో జేఏసీ ప్రెసిడెంట్ మర్మం శంకర్, ఐటీ విభాగం మండల అధ్యక్షుడు అన్నెం జయ చంద్రారెడ్డి , కుందూరు రామిరెడ్డి ముర్తాల రామిరెడ్డి, అన్నెం ఏడుకొండలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story