Eluru: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం!

Eluru: గుంటూరు–కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు డిసెంబర్ 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఈఆర్వో ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 18 Nov 2026 11:48 PM IST
Eluru
X

Eluru: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం!

ఏలూరు జిల్లా: గుంటూరు - కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు డిసెంబర్ 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో), జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

తుది జాబితా: ఫిబ్రవరి 2న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు అని పూర్వ గుంటూరు,కృష్ణా జిల్లాల పరిధిలో స్థానిక నివాసం ఉండి, ఉన్నత పాఠశాల మరియు ఆపై స్థాయి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు,2026 నవంబర్ 1 నాటికి గత ఆరేళ్లలో కనీసం మూడేళ్ల బోధనానుభవం తప్పనిసరి అని ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకుల సర్వీసును డీఈవో, ఆర్ఐవో లేదా కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ ధృవీకరించాలని ఆన్‌లైన్ ద్వారా లేదా ఫారం-19 పూర్తి చేసి స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ (ఏఈఆర్వో) కార్యాలయాల్లో సమర్పించవచ్చు అని ఈ నియోజకవర్గ పరిధిలో సుమారు 19 వేల మంది అర్హులు ఉండగా, ఇప్పటివరకు 15 వేల దరఖాస్తులు అందాయి అని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్,టీడీపీ,వైఎస్ఆర్‌సీపీ,జనసేన,సీపీఐ(ఎం), ఆప్,బీఎస్పీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid