Eluru: ప్రమాదం అంచున పడవ ప్రయాణం
Eluru: గోదావరి నదిలో నిబంధనలకు విరుద్ధంగా చేపలు పట్టే నాటు పడవల్లో వందలాది మంది ప్రయాణికులను ప్రమాదకరంగా తరలిస్తున్నారు.
Eluru: ప్రమాదం అంచున పడవ ప్రయాణం
Eluru: ఏలూరు జిల్లా వేలేర్పాడు మండల పరిధిలోని రుద్రం కోట రేవుకు అవతలి ఒడ్డు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం రేవుకు చేపలు పట్టే నాటు పడవపై ప్రజలను తరలించడం ఆందోళన కరంగా మరింది. రుద్రంకోట - కూనవరం మధ్య గోదావరి పెర్రి వేలం పాట పూర్తయి మూడు నెలలు కావస్తున్న నిర్వాహకులు మాత్రం నిబంధనలు పాటించడంలేదు.
నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడంతో గోదావరి నదిలో తమ ఇష్టానుసారంగా చేపలు పట్టే నాటు పడవ లో ప్రయాణికులను చేరవేస్తూ అధిక చార్జీలు వసుల్ చేస్తున్నారు. వేలేర్పాడు మండలంలోని గ్రామాలైన రుద్రం కోట రేవు నుంచి వేలేర్పాడు, రేపాకాగొమ్ము, లచ్చిగూడెం, వసంత వాడ, కోయిదా, కట్కూరు, మేడిపల్లి, గుళ్ళావాయి, భూదేవిపేట, నార్లవరం, వినాయకపురం,
అశ్వారావుపేట, జీలుగుమిల్లి తదితరుల గ్రామాల నుంచి ప్రజలను అవతలి ఒడ్డుకు చేరావేస్తూ, అవతలి ఒడ్డాయిన కూనవరం రేవు పరిధిలోని కూనవరం, వి. ఆర్ పురం, రాజుపేట, శ్రీ రామ గిరి,రేఖపల్లి, మురుమూరు, చింతూరు, తోటపల్లి, నెల్లిపాక, గోగుభాకా,కాసారం, తదితర గ్రామాలకు ప్రయాణికులను ఇవతలి ఒడ్డాయిన రుద్రం కోట చేరవేసి అందినకాడికి దోచుకుంటున్నారు.
రుద్రం కోట - కూనవరం రేవులో నిత్యం సుమారు 400 - 500 మందికి పైగా చేపల పడవల్లో దాటిస్తున్న రేవు పైన పోలీస్, రెవిన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చేపలు పట్టే నాటు పడవలో పరిమితికి మించి 30 - 40 మంది ప్రయాణికులను బస్తాలు పేర్చినట్లు పెర్చడమే కాక, అందులో బైక్లను సైతం ఎక్కించుకొని గోదావరి నదిలో ప్రయాణికులకు పరిమితికి మించి ఎక్కించి నలుగు రైదుగురి లైఫ్ జాకెట్లు వేసి
ప్రయాణీకుల రక్షణను గాలికి వదిలేసి ప్రయాణీకుల ప్రాణాలతో చేలగాటం ఆడుతూ, ధనార్జనే ధ్యేయంగా బోటు నిర్వాహకులు తమ బోటు వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బోటు యజమానులు పరిమితికి మించి జనంతో గోదావరి లో అనుమతిలేని నాటు పడవలో అవతలికి ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకు, ఇవతలి ఒడ్డుకునుంచి అవతలి ఒడ్డుకు జనాన్ని
పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాలు జరిగాక కట్టుదిట్టం చేయడం కంటే ముందే బోటు నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనల ప్రకారం అనుమతి పొందిన లైసెన్స్ ఉన్న బోటులోనే ప్రయాణికులను తరలించాలని,
లైసెన్సులో పేర్కొన్న పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అధిక చార్జీలు వసూలు చేస్తున్న బోటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చార్జీల ధరల పట్టి రేవు దగ్గర ఉండేలా చూడాలని, నిరంతరం పోలీస్ రెవిన్యూ అధికారుల పర్యవేక్షణలో రుద్రం కోట - కూనవరం రేవుల బోటు ప్రయాణం సాగేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.




