Eluru: వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద హెచ్చరిక!
Eluru: గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
Eluru: వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద హెచ్చరిక!
Eluru: ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది - ప్రజలు అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలి.
ముంపునపు గురయ్యే దిగువ ప్రాంత, పరివాహక ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
ప్రజలు ఎవ్వరు నదిలోకి వెళ్లవద్దు-ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, విహార యాత్రలు వంటివి చెయ్యవద్దు.
గోదావరి నది పరివాహక, లోతట్టు గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా పక్కాచర్యలు చేపట్టాలి - అధికారులు సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .
వేలేరుపాడు మండల కేంద్రం లోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.వివిధ శాఖలు అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ రెడ్డి పాల్గొన్నారు. ఫీల్డు విజిట్ అనంతరం జిల్లా కలెక్టరు రెండవసారి అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు వరదప్రభావిత, లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాదిపతిన తరలించాలని ఆదేశించారు. అదే క్రమంలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించామని అన్నారు.
గత వరద పరిస్థితులను అధ్యయనం చేసి, ప్రస్తుత ఉన్న పరిస్థితులను పక్కా చర్యలు చేపట్టాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులందరూ అప్రమత్తతో ఉండి, ఎటువంటి ఆస్థి, ప్రాణనష్టం జరగకుండా పక్కాచర్యలు తీసుకోవాలన్నారు. పెదవాగుకు వరద ఉధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలని, నదికి అనుకుని ఉన్న ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. నదిలోకి ఎవరూ ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, విహారయాత్రలు వంటివి చెయ్యకుండా ఆయా గ్రామాలలో అధికారులు టామ్ టామ్ ద్వారా తెలియ జేయాలన్నారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలలో బోట్లు, గజఈతగాళ్లను సిద్ధం చేయాలన్నారు.
ఆగస్టు 15వ తేదీ లోగా ప్రసవించే గర్భిణీలు, ఐరిస్క్ గర్భిణీస్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని, చిన్నపిల్లలు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. గ్రామస్థాయిలో రెవిన్యూ, పంచాయతీ, వైద్యఆరోగ్య శాఖ, అగ్నిమాపక సిబ్బంది, తదితర శాఖలు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు.
రెండు మండలాలకు 12 బోట్లు కావాలని, ఇప్పటికే నాలుగు బోట్లు సిద్ధంగా ఉన్నాయని రేపటికి 8 బోట్లు సిద్ధంచెయ్యాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. ప్రతి హాబిటేషన్లో ప్రత్యేక అధికారి, అన్ని మందులతో పాటు పాము కాటు విరుగుడు మందుతో వైద్య శిబిరాలు సిద్ధంచెయ్యాలని వైద్యఆరోగ్యశాఖ అధికారికి ఆదేశించామని తెలిపారు. 750 టార్పాయిన్లు లోతట్టు ప్రాంతాలకు పంపిణీ చేశామని, ఇంకా అవసర మైన వారిని గుర్తించి వారికి కూడా టార్పాయిన్లు అందించాలని అన్నారు.
ఎన్డిఆర్ఎఫ్, ఎస్టిఆర్ఎఫ్ బృందాలు ఎట్టిపరిస్థితుల్లోనూ వరదప్రభావిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా శాఖ అధికారిని జిల్లా కలెక్టరు ఫోన్లో ఆదేశించారు. వేలేరుపాడు మండలానికి 7, కుక్కునూరు మండలానికి 5 భారీ జనరేటర్లను సిద్ధం చేశామన్నారు. అంగన్వాడి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలాలు, వసతిగృహాలకు ఏటువంటి ఆటంకాలు కలపకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని, ఆయా ఉపాధ్యాయులు, వార్డెన్లు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి పాఠశాలలో, వసతిగృహాల్లో 1000 లీటర్లు సామర్థ్యం కలిగిన సింథటిక్ ట్యాంకులు ఉదయానికి అందేలా చూసి, మంచినీటిని నిల్వలు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులు, మూగ జీవాలు సురక్షిత ప్రాంతాలకు తరలించి, దాణా, మంచినీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.
వాహనాలు, 108, 104, అగ్నిమాపకదళ వాహనాలు, లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లు, వరద విపత్తునివారణ ఆధునిక యంత్రాలు, పరికరాలు సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు సూచనలను, సలహాలను పాటించాలని, పుకార్లు, వదంతులు నమ్మవద్దని ప్రజలకు జిల్లా కలెక్టరు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జెడ్పీ సిఇవో పి.జగదాంబ, ఆర్డీవో యం.వి. రమణ, ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, జిల్లా పంచాయతీ అధికారి జి.వి.కె.మల్లిఖార్జునరావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖఅధికారి డా.యుశోభ, డిసిహెచ్ డా.సి.హెచ్. బేబి కమల, విద్యుత్తు శాఖ యస్ఇ యం.అంబేద్కర్, వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీభ్ భాషా, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకట లక్ష్మమ్మ, మత్స్యశాఖ డిడి ఆర్.వి. యస్.వి. ప్రసాదు,ఐసిడిఎస్ పిడి పి.శారద, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి యన్. జితేంద్రబాబు, డీఆర్డీఏ పిడి టి.వి.విజయలక్ష్మి, సంబంధిత జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు.




