Eluru: గోదావరి వరద ఉధృతి: కుక్కునూరు, వేలేరుపాడులో నిలిచిన రాకపోకలు!

Eluru: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 31 July 2026 8:06 AM IST
Eluru
X

Eluru: గోదావరి వరద ఉధృతి: కుక్కునూరు, వేలేరుపాడులో నిలిచిన రాకపోకలు!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 34.90 అడుగులకు చేరగా, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో నదీపరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారు.

భద్రాచలం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుతుంది. కుక్కునూరు మండలంలో గుండేటివాగు బ్రిడ్జిపైకి వరద నీరు చేరుకోవడంతో దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలో దాదాపు 10 గ్రామాలకు రోడ్డు మార్గం మునిగిపోయి రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీంతో 20 కి.మీ అదనంగా ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అదే విధంగా వేలేరుపాడు మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద ఉన్న ఎద్దు వాగు వంతెన పూర్తిగా వరదనీటిలో మునగటంతో కోయిదా,కట్కూరు, కాక్కిసనూరు,టేకుపల్లి, టేకురు, పేరంటాలపల్లి, కాచారం పంచాయతీల పరిధిలోని 15 ఏజెన్సీ గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల్లో నివసించే ప్రజలు వేలేరుపాడు మండల కేంద్రానికి ప్రతిరోజు వచ్చి నిత్యావసర సరుకుల కొనుగోలు చేస్తూ జీవనం సాగించే వాళ్ళు కావడం వల్ల వర్షపునీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story