Chintoor: శబరి ఉధృతి తగ్గింపు ఊపిరి పీల్చుకున్న ప్రజలు!

Chintoor: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన గోదావరి, శబరి వరద ఉధృతి. లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 2 Aug 2026 9:16 AM IST
Chintoor
X

Chintoor: శబరి ఉధృతి తగ్గింపు ఊపిరి పీల్చుకున్న ప్రజలు!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి శబరి నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహించి లోతట్టు ప్రాంత ప్రజలను దడ పుట్టించాయి. శనివారం అర్ధరాత్రి నుండి గోదావరి శబరి నదులు శాంతించి వరద తగ్గుతూ వస్తుంది. ఆదివారం ఉదయం చింతూరు వద్ద శబరి 41 అడుగులకు చేరుకొని ప్రవహిస్తుంది.

కూనవరం వద్ద గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. చింతూరు ఏజెన్సీలో వరద తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చింతూరు ఏజెన్సీలో వరద ఉధృతి వలన 563 ఇళ్లలోకి నీరు చేరి 608 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. 44 రహదారులు జలమయం అయ్యి 10 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మబ్బు గ్రామాల్లో ఉన్న 110 గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story