Nuzvid: నూజివీడు కోట అమ్మవారి ఆలయంలో 70వ శరన్నవరాత్రి ఉత్సవాలు!
Nuzvid: నూజివీడు శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయంలో 70వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
Nuzvid: నూజివీడు కోట అమ్మవారి ఆలయంలో 70వ శరన్నవరాత్రి ఉత్సవాలు!
Nuzvid: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మద్దిని అమ్మవారు నేడు ఏడవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు తెల్లవారుజాము నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.నేడు అమ్మవారికి పూర్ణాలు,క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే ఐశ్వర్యం,సౌభాగ్యం,సకల శుభాల కోసం అమ్మవారిని భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు.ఈ ఆలయం 12వ శతాబ్దం నాటిదని గతంలో ఎవరైనా శత్రు రాజుల దండయాత్రకు వస్తే అమ్మవారు జమీందారులకు సాంకేతాలు పంపేదని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయ ప్రధాన అర్చకుడు సతీష్ మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క విశిష్టత మరియు ఏర్పాట్లు పై వివరించారు.




