Eluru: పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి!

Eluru: ఏలూరు జిల్లాలో బంధువుల మధ్య జరిగే దత్తతకైనా 'కార' నిబంధనల ప్రకారం కలెక్టర్ అనుమతి, తుది ఉత్తర్వులు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Nov 2026 10:43 AM IST
Eluru
X

Eluru: పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి!

Eluru: పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.శుక్రవారం ఏలూరు జిల్లా దెందులూరు మండలంనకు కి చెందిన దంపతులు వారి సొంత అక్క వాళ్ళ 10 సంవత్సరాల పాప ను కామవరపుకోట కి చెందిన దంపతుల నుండి దత్తత తీసుకున్నారు.

వారు వారి వివరాలను కేరింగ్స్ లో రిలేటివ్ అడాప్షన్ కేటగిరీ లో రిజిస్ట్రేషన్ చేసుకుని దత్తత విధానాలు కి అవసరమైన అన్నీ డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత తుది దత్తత ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వీ నుండి పొందారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బంధువుల మధ్యలో గానీ,ఆయిన వాళ్ళ మధ్యలో గానీ పిల్లలు లేని దంపతులు వేరొక బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటే అది ఏ రకమైన దత్తతైన మిషన్ వాత్సల్య పోర్టల్ లో భాగమైన 'కార' నియమ నిబంధనల ప్రకారము కలెక్టర్ ఆమోదము,తుది ఉత్తర్వులను కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి వద్ద నుండే పొందాలన్నారు.

దత్తత అనేది అనేక రకాలుగా ఉంటుందని,అనాధలు, వదిలివేయబడిన బాలలు, ప్రభుత్వానికి సరెండర్ చేసిన బాలలు ను ప్రభుత్వం ద్వారా దత్తత పొందటం ఒక విధానం అయితే దేశీయ బంధుత్వపు దత్తత,స్టెప్ పేరెంట్ అడాప్షన్ దేశీయ దత్తతం లోకి వస్తాయి.

అదేవిధంగా దేశాంతర దత్తతలో హిందూ దత్తత చట్టం ప్రకారము దత్తత తీసుకున్నప్పటికిని వాటికి కలెక్టర్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్య చక్రవేణి,శిశు గృహ మేనేజర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్