Chintalapudi: ప్రగడవరంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి వరలక్ష్మి నామినేషన్!
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి గుంటక వరలక్ష్మి నామినేషన్ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.
Chintalapudi: ప్రగడవరంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి వరలక్ష్మి నామినేషన్!
ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి గుంటకు వరలక్ష్మి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. పార్టీ శ్రేణుల హాజరుతో నామినేషన్ కార్యక్రమం సందడిగా కొనసాగింది.
ఈ సందర్భంగా అభ్యర్థి గుంటక వరలక్ష్మి తనయుడు రఘునాధ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రగడవరం గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని, ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చేలా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. మహిళలు, యువత, వృద్ధులు, పేద కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.
పంచాయతీ పరిధిలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అభ్యర్థి వెల్లడించారు.
వైసీపీ సీనియర్ నాయకులు గోలి శరత్ రెడ్డి మాట్లాడుతూ....
ఇదే పంచాయతీ లో టీడీపీ అభ్యర్థి మామగారు 40 ఏళ్ళు గా టీడీపీ నాయకులు, ఆ పార్టీ అధికారం లో 20 సంవత్సరాలు వుంది అప్పుడు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలి..
ఇదే పంచాయతీ లో వైస్సార్ ఉండగా కాంగ్రెస్ గవర్నమెంట్ సీసీ రోడ్లు వేశారు, జగన్ ప్రభుత్వం లో ఇంటి ఇంటికి పార్టీ చూడకుండా అర్హులైన ప్రతీ వారికి పధకం ఇచ్చాము,
ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఏ పధకాలు ఇంటికి వెళ్లి ఇస్తున్నారు... వైసీపీ ప్రభుత్వం లో కరెంటు సర్వీస్ ఐదు, పది వేలలో వచ్చేది ఇప్పుడు ఎక్కడ వస్తుంది చెప్పాలి.. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో ప్రగడవరం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
నాయకులు, కార్యకర్తలు, అభిమానుల హాజరుతో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.




