Eluru: అర్నాబ్ తుఫాన్ ధాటికి బస్సుపై పడ్డ చెట్టు!

Eluru: ఏలూరులో అర్నాబ్ తుఫాన్ తీవ్ర రూపం. పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు బస్సుపై కూలిన భారీ వృక్షం. డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Oct 2026 10:51 AM IST
Eluru
X

Eluru: అర్నాబ్ తుఫాన్ ధాటికి బస్సుపై పడ్డ చెట్టు!

Eluru: ఏలూరులో అర్ణబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది.భారీ వర్షం కారణంగా పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ప్రతాప్ ట్రావెల్స్ బస్సుపై ఒక్కసారిగా భారీ వృక్షం కూలిపడి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ..డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.గాయపడిన డ్రైవర్‌ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.ఫైర్,పోలీస్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్టును తొలగించి,ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్