Kukkunoor: నాటు సారా స్థావరాలపై కుక్కునూరు పోలీసుల దాడి!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీసుల మెరుపు దాడులు. బూర్గువాయి అటవీ ప్రాంతంలో 350 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. ఎస్సై రాజారెడ్డి హెచ్చరిక.
Kukkunoor: నాటు సారా స్థావరాలపై కుక్కునూరు పోలీసుల దాడి!
Kukkunoor: స్థావరాలపై కుక్కునూరు పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్గువాయి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అటవీ ప్రాంతంలోని వాగులో డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 350 లీటర్ల బెల్లం ఊటును పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు.
ఈ బెల్లం ఊట ఎవరికి సంబంధించినదని గుర్తించేందుకు చర్యలు చేపట్టమని, అక్రమంగా బెల్లం ఊట తయారు చేసి, నాటు సారా తయారీకి వినియోగిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




