Eluru: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన నిపుణులు: పనులపై సంతృప్తి!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించి, ప్రాజెక్టు పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసింది. (

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2026 9:27 PM IST
Eluru
X

Eluru: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన నిపుణులు: పనులపై సంతృప్తి!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సంజీవ్‌ వోహ్రా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం అనంతరం,నిపుణులు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లోని గ్యాప్‌-1,గ్యాప్‌-2 ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని వీక్షించారు.గత పర్యటనల్లో తాము ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ,మేఘా ఇంజినీరింగ్‌ (ఎంఈఐఎల్‌) ప్రతినిధులు చేపట్టిన సహాయక చర్యలు,ఇప్పటివరకు జరిగిన పనుల పట్ల నిపుణుల బృందం ప్రాథమికంగా సంతృప్తి వ్యక్తం చేసింది.

ఇప్పటికే ఏడు విడతలుగా పోలవరాన్ని సందర్శించిన నిపుణులు, ప్రస్తుతం 8వ విడత పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు.అంతర్జాతీయ డ్యామ్‌ల నిపుణులు రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌,డేవిడ్‌ పాల్‌లతో కూడిన ఈ బృందంతో పాటు కేంద్ర జలశక్తి శాఖ,కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సీఎస్‌ఎంఆర్‌ఎస్‌,వ్యాప్కోస్‌ ఉన్నతాధికారులు మరియు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.క్షేత్రస్థాయి పరిశీలన ముగించుకుని,ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతుల పై సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఈ నిపుణుల బృందం పర్యటన ఈ నెల 17వ తేదీ వరకు ఇక్కడే కొనసాగనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్