Jaddangi: జడ్డంగి సంత మార్కెట్ షెడ్లు పరిశీలించిన ఎమ్మెల్యే శిరీషదేవి

Jaddangi: రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ సంతను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

PRASANNA, RAMACHANDRAPURAM
Published on: 11 Jun 2026 4:08 PM IST
Jaddangi
X

Jaddangi: జడ్డంగి సంత మార్కెట్ షెడ్లు పరిశీలించిన ఎమ్మెల్యే శిరీషదేవి

Jaddangi: రాజవొమ్మంగి మండలం. జడ్డంగి గ్రామంలో సంత మార్కెట్ షెడ్లు మరియు సంత ప్రదేశం అంతా అపరిశుభ్రంగా ఉండడం, షెడ్లు రిపేర్లకు గురవ్వడాన్ని ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ST సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి పరిశీలించారు.

సంత దుకాణాలు NH 516E రోడ్డు మీద,డ్రెయిన్లు మీద పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని షెడ్లు లోనే దుకాణాలు పెట్టుకునే విధంగా షెడ్లు, మార్కెట్ ప్రదేశాన్ని పరిశుభ్రం చేసి, రిపేర్లు చేసి అందుబాటులోకి తేవాలని, అందుకుగానూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆమె వెంట APIIC డైరెక్టర్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, సీనియర్ తెలుగుదేశం నాయకులు గణజాల తాతారావ్, మాజీ సర్పంచ్ కోపూరి రత్నం, మండల తెలుగు యువత అధ్యక్షుడు, బారంగి అనుదీప్, చెక్కా పండుబాబు, ముంగారి అమ్మన్న, రాటా సోమరాజు, ఎలిసెట్టి అప్పలరాజు, కోట్లింక వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story