Chinturu: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ పంపిణీ!
Chinturu: చింతూరు, ఎటపాక మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెడ్ షీట్లు, పిల్లో కవర్లు పంపిణీ చేశారు.
Chinturu: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ పంపిణీ!
చింతూరు: పేదలు,గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయా ఆసుపత్రులకు అవసరమైన సహకారం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,చింతూరు మండల టీడీపీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ అన్నారు.
జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఎటపాక మండలం లోని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అందజేశారు.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొహమ్మద్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ పేదలు, గిరిజనులు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల పై ఆధారపడుతున్నారని వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా తమ ట్రస్ట్ తరఫున చేతనైన సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం,సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించడం తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.గతంలోనూ జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలు, గిరిజన కుటుంబాలకు వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించామని భవిష్యత్తులో కూడా విద్య, వైద్యం, పేదల సంక్షేమం, అత్యవసర సహాయం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని మొహమ్మద్ జమాల్ ఖాన్ తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన సామగ్రిని అందించిన జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సేవలను ఆసుపత్రి సిబ్బంది అభినందిస్తూ, రోగులకు ఉపయోగపడే విధంగా వినియోగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వచైతన్య, డాక్టర్ రాజశేఖర్,ఎటపాక మండల టీడీపీ కార్యదర్శి కణితి మధు,మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.




