Nuzvid: నూజివీడు స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం చారిత్రాత్మక అవసరం!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు విజ్ఞప్తి.
Nuzvid: నూజివీడు స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం చారిత్రాత్మక అవసరం!
Nuzvid: నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఏఎంసీ చైర్మన్,రావిచర్ల మాజీ సర్పంచ్,బోరవంచ ఎంపీటీసీ అభ్యర్థి కాపా శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ సహకారంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహాయ సహకారాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు,అమరావతి రాజధాని నిర్మాణం,చింతలపూడి ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రానికి నూతన దిశానిర్దేశం జరుగుతోందని తెలిపారు.రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలంటే స్థానిక సంస్థల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అవసరమని అన్నారు.
పట్టణాలు,గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీలు,గ్రామ పంచాయతీలు,ఎంపీటీసీ,జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గత రెండున్నర సంవత్సరాలుగా చేస్తున్న కృషిని ప్రజలు గమనించాలని కాపా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ప్రత్యేకంగా రావిచర్ల,బోరవంచ గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని,రావిచర్ల గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేశానని గుర్తుచేశారు.
అయితే తాను పుట్టి పెరిగిన బోరవంచ గ్రామం అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.అందుకే బోరవంచ గ్రామ అభివృద్ధిని తన బాధ్యతగా భావించి ఎంపీటీసీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తెలిపారు.2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి,ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు బేరీజు వేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఎవరు గెలిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో, ఎవరి ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు,ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
చివరిగా బోరవంచ,రావిచర్ల గ్రామాల ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ,వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ కలవలేకపోయినా తన అభ్యర్థిత్వాన్ని ఆదరించాలని, బోరవంచ ఎంపీటీసీగా తనను ఆశీర్వదించి,సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,బోరువంచ ఎంపీటీసీ అభ్యర్థి కాపా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.




