Konaseema: ఆందోళన వద్దు.. రేపటికల్లా జిల్లాకు డీజిల్ స్టాక్!

Konaseema: కోనసీమ జిల్లాలో డీజిల్ కొరతపై జాయింట్ కలెక్టర్ నిధియా దేవి కీలక ప్రకటన చేశారు.

PRABHU, RAZOLE
Published on: 26 April 2026 7:24 PM IST
Konaseema
X

Konaseema: ఆందోళన వద్దు.. రేపటికల్లా జిల్లాకు డీజిల్ స్టాక్!

Konaseema: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందో ళన చెంద వలసిన అవసరం లేదని ఈనెల 27 ఉదయం కల్లా జిల్లాకు ఆయిల్ సరఫరా కాబడి రెండు రోజులలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రజలు పూర్తిగా సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి కోరారు.జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న డీజిల్ కొరతపై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి, ఆదివారం స్థానిక కలెక్టరేట్ నందు పాత్రికేయుల సమావేశం

నిర్వహించారు. జిల్లాలో గత కొన్నిరోజులుగా డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కీలక వివరణ ఇచ్చారు. జిల్లా ప్రజలు, రైతులు మరియు వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలో సాధారణ పరిస్థితిలు నెలకొంటాయని, ప్రజలు సంయమనం పాటిస్తూ సహకరించాలని హితవు పలికారు.సరఫరా పునరుద్ధరణ కొరకు చమురు సంస్థలతో నిరంతరం సంప్రదింపులు

జరుపుతున్నామన్నారు, జిల్లావ్యాప్తంగా 110 అవుట్లెట్ బంకులు ఉన్నాయని ప్రస్తుతం ఉన్న నిల్వలు పెట్రోలు 778.7 కిలో లీటర్లు, డీజిల్ 497.6 కిలోలీటర్లు ఉన్నాయన్నారు, వచ్చే వారానికి గాను పెట్రోలు 1,290 కిలోలీటర్లు డీజిల్ 2,060 కిలోలీటర్లు అవసరం ఉందన్నారు.ప్రస్తుతం రోజువారి అమ్మ కాలు పెట్రోలు 213.2 కిలోలీటర్లు, డీజిల్ 273.1 కిలో లీటర్లుగా ఉన్నాయన్నారు. గత ఏడాది ఇదే సమయంలో రోజువారి అమ్మకాలు పెట్రోలు 169.9 కిలోలీటర్లు డీజిల్ 207.8 కిలో లీటర్లుగా నమోదు కాబడిందన్నారు.

కొందరు డీలర్లు కావాలనే స్టాక్ ఉన్నప్పటికీ లేదని చెప్పి కృత్రిమ కొరత సృష్టించినా, లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం వ్యవసాయ వరి కోతలు ఆక్వారంగ పనుల సీజన్ కావడంతో, సాగుపనులకు ఆటంకం కలగకుండా రైతులకు అవసరమైన డీజిల్ సకాలంలో అందేలా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలను,

పర్యవేక్షించడానికి రెవెన్యూ మరియు పౌరసరఫరాల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రజలు డీజిల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండి ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమన్నారు. త్వరలోనే సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుం టుందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నంబర్ 9059 920242, 94933 13862 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చునని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని భయాందోళన అవసరం లేదని యధావిధిగా డీజిల్ సరఫరా కొనసాగుతుందన్నారు అపోహలకులోనై అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని హితవు పలికారు.బ్లాక్ మార్కెట్ లో ఇంధనం అమ్మకాలు నిర్వహించే వారిపై 6ఏ కింద కేసులు బనాయించడం జరుగు తుందన్నారు.జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న ప్రచారం అవాస్తవమని. అపోహలు నమ్మి వినియో గదారులు ఎవరు ఆందోళ నకు గురికావలసిన పనిలేదన్నారు. జిల్లాలోని పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు ఉండేలా చూసి, ప్రజల విశ్వాసాన్ని

నిలబెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల వద్ద మండల స్థాయి అధికారులను నియమించి, నిల్వల లభ్యత, అమ్మకాలను నిత్యం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. ప్రజలు భయాందోళనలకు గురై అవసరాలకు మించి ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయ వద్దన్నారు జాయింట్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ బృందాలు జిల్లాలోని ఇంధన రిటైల్ అవుట్‌లెట్లను తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎవరి వద్ద అయిన అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరిగినట్లు గుర్తిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆడపా ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story