Amalapuram: నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. జేసీ హెచ్చరిక

Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో జేసీ వైఖోమ్ నిడియా దేవి సమీక్ష. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ సిబ్బందికి హెచ్చరిక.

PRABHU, RAZOLE
Published on: 24 April 2026 3:01 PM IST
Amalapuram
X

Amalapuram: నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. జేసీ హెచ్చరిక

Amalapuram: అమలాపురం జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం మరింత పారదర్శకంగా, వేగవంతంగా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి రెవెన్యూ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని వివిధ విభాగాల సిబ్బందితో ఆమె తొలి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ పనుల నిర్వహణలో జాప్యానికి తావులేకుండా, అత్యంత చురుగ్గా మరియు కచ్చితత్వంతో బాధ్య తలను నిర్వర్తించాలని సూచించారు.

ప్రజా సేవే పరమావధిగా కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలను పదేపదే తిప్పించుకోకుండా, వారి సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. అందించే సేవలు కేవలం వేగంగా ఉండటమే కాకుండా, నాణ్యతతో కూడినవై ఉండాలని, తద్వారా సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు.

విధుల పట్ల అంకితభావంతో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు భారంగా మారకూడదన్నారు కార్యాలయానికి వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవం మరియు సకాలంలో పరిష్కారం లభించినప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్‌లోని పరిపాలనాధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు వివిధ విభాగాల పర్యవేక్షకులు సుబ్బలక్ష్మి, సుబ్బరాజు, నాగలక్ష్మమ్మ సెక్షన్ అధికారులు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది భరత్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story