Nuzvid: నూజివీడులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!

Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడులో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోట మహిషాసుర మర్దిని అమ్మవారు తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Oct 2026 8:12 AM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!

Nuzvid: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి.పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మద్దిని అమ్మవారు నేడు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

నేడు తెల్లవారుజాము నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఏదైనా కోరిక కోరితే తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఈ ఆలయం 12వ శతాబ్దం నాటిది,నాడు జమీందారీ కాలంలో ఎవరైనా శత్రువు రాజులు దండయాత్రకు వస్తే అమ్మవారు జమీందారులకు సాంకేతాలు పంపేదని చరిత్ర చెబుతుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్