Velerupadu: వసంతవాడలో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన జగదీశ్వరి!
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పి-4 కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఏపీ షాప్ చైర్మన్ కొవ్వాసు జగదీశ్వరి.
Velerupadu: వసంతవాడలో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన జగదీశ్వరి!
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ గ్రామంలో పి-4 కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టుమిషన్లను ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ కొవ్వాసు జగదీశ్వరి పంపిణీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ వేలేరుపాడు మండలంలోని మారుమూల గ్రామమైన వసంతవాడకు రావడం చాలా సంతోషంగా ఉంది.
మహిళలను ఆర్థికంగా నిలబెట్టి, మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేలా చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను ప్రోత్సహిస్తున్నారు. మహిళలు, యువతను ప్రోత్సహిస్తూ, యువతకు రానున్న రోజుల్లో ఉపాధి కల్పనకు కృషి చేస్తాను.
పి-4 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను సందర్శించి కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని జగదీశ్వరి ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పి-4 కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.




