Kukkunoor: కుక్కునూరులో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరు
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో కూటమి అభ్యర్థులు ఆశి శ్రీలత, బొంతు కోమలదేవికి మద్దతుగా టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు ప్రచారం చేశారు.
Kukkunoor: కుక్కునూరులో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరు
కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని కుక్కునూరు పంచాయతీ పరిధిలో కూటమి బలపరిచిన ఎంపీటీసీ-2 అభ్యర్థి ఆశీ శ్రీలత, జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమలదేవికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి ఆశీ శ్రీలత, జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమలదేవికి కేటాయించిన సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కూటమి నాయకులు ప్రజలను కోరారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కూటమి నాయకులకు మహిళలు మంగళహారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




