Kukkunoru: ప్రైవేట్ మోజు వద్దు.. ప్రభుత్వ బడిలోనే పిల్లల్ని చేర్పించండి
Kukkunoru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో మండల విద్యాశాఖాధికారి (MEO) కె. ధనలక్ష్మి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.
Kukkunoru: ప్రైవేట్ మోజు వద్దు.. ప్రభుత్వ బడిలోనే పిల్లల్ని చేర్పించండి
Kukkunoru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో గణేష్ నగర్ కాలనీలో మండల విద్యాశాఖాధికారి కె . ధనలక్ష్మి మంగళవారం ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు, ప్రత్యేకతలు ఉన్నాయని, నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నామని ఎంఈఓ కె. ధనలక్ష్మి వివరించారు. కాలనీలోని తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంట ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు. చెట్టు కింద సమావేశమైన కాలనీవాసులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. డ్రాపౌట్ పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఎంఈఓ ధనలక్ష్మి మాట్లాడుతూ:. ప్రభుత్వ బడులు ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఉన్నాయి. డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ మీడియం, అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్కూళ్లను నమ్మండి అని కోరారు.




