Kukkunuru: కుక్కునూరులో కూటమి అభ్యర్థుల తరఫున జోరుగా ఎన్నికల ప్రచారం!

Kukkunuru: కుక్కునూరు మండలం గణపవరం - పెదరాయిగూడెం ఎంపీటీసి అభ్యర్థి గాడిద అలివేలు ఆధ్వర్యంలో జోరుగా సాగుతున్న కూటమి ఎన్నికల ప్రచారం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 1 Nov 2026 6:15 PM IST
Kukkunuru
X

Kukkunuru: కుక్కునూరులో కూటమి అభ్యర్థుల తరఫున జోరుగా ఎన్నికల ప్రచారం!

Kukkunuru: కుక్కునూరు మండల పరిధిలోని గణపవరం - పెదరాయిగూడెం ఎంపీటీసీ అభ్యర్థి గాడిద అలివేలు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి గాడిద అలివేలు గాజు గ్లాసు గుర్తుపై, జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమల దేవి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అభ్యర్థులు తెలిపారు. గ్రామాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR