Kukunoor: వీఓఏలు, ఎస్‌హెచ్‌జీ మహిళల సమస్యలు పరిష్కరించాలి – సీఐటీయూ

Kukunoor: కుక్కునూరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన సీఐటీయూ. వీఓఏలు, ఎస్‌హెచ్‌జీ మహిళల సమస్యలు పరిష్కరించాలని, గ్రూపుల మార్పుపై విచారణ జరపాలని డిమాండ్.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 29 Sept 2026 5:55 PM IST
Kukunoor
X

Kukunoor: వీఓఏలు, ఎస్‌హెచ్‌జీ మహిళల సమస్యలు పరిష్కరించాలి – సీఐటీయూ

కుక్కునూరు: వీఓఏలు, ఎస్‌హెచ్‌జీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ కోరారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో యానిమేటర్లు కుక్కునూరు తహసీల్దార్ చలపతిరావుకు వినతిపత్రం అందజేశారు.

మండల కార్యాలయాల్లో వాష్‌రూమ్‌లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఐటీయూ ప్రతినిధులు తెలిపారు. అలాగే మండల సమాఖ్య కార్యాలయంలో మధ్యాహ్నం సమయంలో సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వీఓఏలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు.

కుక్కునూరు వీఓ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఎస్‌హెచ్‌జీ గ్రూపును భారతి వీఓలోకి మార్చిన వ్యవహారంపై కూడా సీఐటీయూ ప్రతినిధులు విచారణ కోరారు. సంబంధిత గ్రూపుల తీర్మానాలు, నిబంధనల ప్రకారం మార్పు జరిగిందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గ్రూపు మార్పులో తీర్మానాలు, సంతకాల విషయంలో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులు ఉన్నందున అధికారులు వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ అంశంపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఫిర్యాదుదారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని సీఐటీయూ కోరింది. కార్యక్రమంలో వీఓఏ యూనియన్ అధ్యక్షురాలు దాసరి సౌజన్యతో పాటు పలువురు నాయకులు, యానిమేటర్లు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR