Kukunoor: సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

Kukunoor: కుక్కునూరులో అనారోగ్య బాధితురాలికి సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.66,572 మంజూరు. లబ్ధిదారురాలికి చెక్కు అందజేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 11 Sept 2026 10:53 PM IST
Kukunoor
X

Kukunoor: సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

కుక్కునూరు: అనారోగ్యంతో బాధపడుతున్న కుక్కునూరు మండలం పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన పల్లెల మరేశ్వరి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం పొందారు.

వైద్య ఖర్చుల నిమిత్తం స్థానిక జనసేన నాయకత్వాన్ని సంప్రదించిన ఆమెకు, వారి సూచన మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రూ.66,572 ఆర్థిక సాయం మంజూరైంది.

మంజూరైన సహాయానికి సంబంధించిన చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లబ్ధిదారురాలు పల్లెల మరేశ్వరికి స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారురాలు మాట్లాడుతూ, తన వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షుడు మంత్రి గోపాలకృష్ణ, నాయకులు చల్ల కోటి, గాడిద వెంకటేశ్వర్లు, భద్రి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR