Kukunoor: కామ్రేడ్ సరోజిని (సీతక్క) సంతాప సభ – నాయకుల నివాళి

Kukunoor: కుక్కునూరులో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ గంగసాని సరోజిని (సీతక్క) సంతాప సభ నిర్వహించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 4 Sept 2026 8:31 PM IST
Kukunoor
X

Kukunoor: కామ్రేడ్ సరోజిని (సీతక్క) సంతాప సభ – నాయకుల నివాళి

కుక్కునూరు: గోదావరి లోయ విప్లవ పోరాట యోధురాలు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సీనియర్ నాయకురాలు కామ్రేడ్ గంగసాని సరోజిని (సీతక్క) ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి అన్నారు.

కుక్కునూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎస్‌కే గౌస్ అధ్యక్షతన శుక్రవారం సీతక్క సంతాప సభ నిర్వహించారు. తొలుత సీతక్క చిత్రపటానికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. రంగారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి గోదావరి లోయలో భూ పోరాటాలకు సీతక్క నాయకత్వం వహించారని తెలిపారు.

పేదలు, ఆదివాసీల హక్కుల కోసం సుమారు ఐదు దశాబ్దాలుగా నిస్వార్థంగా పోరాడారని పేర్కొన్నారు. సీతక్క కుమార్తె కెచ్చెల కల్పన, ఎస్‌కే గౌస్ మాట్లాడుతూ ఆమె స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story