Kukunoor: అక్రమంగా ట్రామడాల్ ఇంజెక్షన్ల విక్రయం - ఆర్‌ఎంపీ అరెస్ట్
Kukunoor: కుక్కునూరులో ట్రామడాల్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాల కేసులో ఆర్‌ఎంపీ డాక్టర్ అరెస్ట్. 73 ఇంజెక్షన్లు, సెల్ ఫోన్ స్వాధీనం.
Kukunoor: అక్రమంగా ట్రామడాల్ ఇంజెక్షన్ల విక్రయం - ఆర్‌ఎంపీ అరెస్ట్
కుక్కునూరు: ట్రామడాల్ ఇంజెక్షన్ల అక్రమ కొనుగోలు, నిల్వ, విక్రయాల కేసులో కుక్కునూరు మండలం కివ్వక గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ పగిల్ల నాగేంద్రకుమార్ (31)ను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 73 ట్రామడెక్స్ ఇంజెక్షన్ అంప్యూల్స్, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ సూచనల మేరకు, డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీఐ ఎం.వి. సుభాష్, ఎస్‌ఐ ఎన్. వీర ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.
బిల్లులు, చెల్లుబాటు అయ్యే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రామడెక్స్, ట్రామెక్ ఇంజెక్షన్ల విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.




