Kukunoor: వింజరం పంచాయతీ పరిధిలో ముగిసిన ఎస్‌ఎంసీ ఎన్నికలు

Kukunoor: కుకునూరు మండలం వింజరం పంచాయతీ ఎర్రబోరు ఎంపీపీఎస్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా వాళ్లిపాక కళ్యాణి, వైస్ చైర్మన్‌గా మడకం పాండు ఎన్నికయ్యారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 29 Sept 2026 5:46 PM IST
Kukunoor
X

Kukunoor: వింజరం పంచాయతీ పరిధిలో ముగిసిన ఎస్‌ఎంసీ ఎన్నికలు

కుకునూరు: వింజరం పంచాయతీ పరిధిలోని ఎర్రబోరు MPPS పాఠశాల SMC ఎన్నికల్లో చైర్మన్‌గా వాళ్లిపాక కళ్యాణి, వైస్ చైర్మన్‌గా మడకం పాండు ఎన్నికయ్యారు. ముత్యాలంపాడు, ఎర్రబోరు, కొండపల్లి ప్రాంతాల్లోనూ పాఠశాల కమిటీ ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలిపారు. కుక్కునూరు మండలంలో తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమన్వయం కొనసాగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR