Kukunoor: మద్యం మత్తులో తండ్రిపై కుమారుడి దాడి కేసు నమోదు
Kukunoor: కుక్కునూరు మండలం బర్లమడుగులో మద్యం మత్తులో తండ్రిపై కుమారుడు కర్రతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kukunoor: మద్యం మత్తులో తండ్రిపై కుమారుడి దాడి కేసు నమోదు
కుక్కునూరు: మండలంలోని బర్లమడుగు గ్రామంలో మద్యం మత్తులో కుమారుడు తండ్రిపై కర్రతో దాడి చేసిన ఘటనపై కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కాక రాజులు (65) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆయన కుమారుడు కాక బాబురావు (40) మద్యం మత్తులో వచ్చి దూషించి, కర్రతో దాడి చేశాడు.
ఈ ఘటనలో రాజులకు తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.




