Velerupadu: వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి కలకలం.. మూడు ఆవులు బలి!

Velerupadu: పోలవరం నియోజకవర్గం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పెద్దపులి కలకలం. కొత్తూరులో మూడు ఆవులపై దాడి చేసి చంపిన పులి. అప్రమత్తమైన అటవీశాఖ.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 10 Nov 2026 12:56 PM IST
Velerupadu
X

Velerupadu: వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి కలకలం.. మూడు ఆవులు బలి!

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. మండలంలోని చిగురుమామిడి బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి, శ్రీరామగిరి–గోదావరి అటవీ ప్రాంతం గుండా జనావాసాల వైపు వచ్చినట్లు తెలుస్తోంది.

మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నార్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో కరటం బ్రహ్మయ్యకు చెందిన మూడు ఆవులపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఒకేసారి మూడు పశువులు మృత్యువాత పడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

పెద్దపులి సంచార నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పెద్దపులి కదలికలపై అధికారులు నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR