Kukunoor: నిర్వాసిత రైతులకు వెంటనే యూరియా అందించాలి
Kukunoor: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పత్తి, మిర్చి రైతులకు వెంటనే యూరియా అందించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్. లేనియెడల ఆందోళన చేపడతామని హెచ్చరిక.
Kukunoor: నిర్వాసిత రైతులకు వెంటనే యూరియా అందించాలి
కుక్కునూరు: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పత్తి, మిర్చి సాగు చేస్తున్న నిర్వాసిత రైతులకు తక్షణమే యూరియా అందించాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముంపు భూములకు పరిహారం అందించామన్న కారణంతో రైతులకు యూరియా అందించకపోవడం సరికాదన్నారు.
ఎరువులు అందకపోతే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే యూరియా సరఫరా చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతుల తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.




