Kunavaram: కూనవరంలో కలం వీడి ఎన్నికల బరిలోకి యువ విలేకరి

Kunavaram: కూనవరం పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న మాజీ విలేకరి మచ్చ వినయ్ ప్రసాద్ ప్రచారం; హాట్ టాపిక్‌గా మారిన బరి.

RAJESH REDDY, CHINTOOR
Published on: 25 Nov 2026 6:36 PM IST
Kunavaram
X

Kunavaram: కూనవరంలో కలం వీడి ఎన్నికల బరిలోకి యువ విలేకరి

కూనవరం : ఇన్నాళ్లు ఇతరుల సమస్యలను అక్షరాల్లో రాశాడు. ఇప్పుడు ఆ సమస్యలను స్వయంగా తీర్చేందుకు బరిలోకి దిగాడు.కూనవరం మండల కేంద్రమైన కూనవరం పంచాయతీ ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కారణం ఒక్కటే... జనసేన అభ్యర్థి మచ్చ వినయ్ ప్రసాద్.విలేకరిగా గ్రామ గ్రామం తిరిగి, ప్రజల కష్టాలు కళ్లారా చూసిన వ్యక్తి ఆయన. రోడ్డు లేదని, నీరు రావడం లేదని, పింఛన్ అందడం లేదని... ఎన్నో వార్తలు రాశాడు. కానీ వార్త రాస్తే సరిపోదు, పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాడు.

అందుకే కలాన్ని పక్కన పెట్టి, ఉంగరం గుర్తుతో ప్రజల ముందుకు వచ్చాడు.

ఇంటింటా ప్రచారం... ప్రతి గడపలో ఆత్మీయ పలకరింపు. "మీ సమస్య నాకు తెలుసు, మీ బాధ నాకు తెలుసు" అని చెబుతుంటే, ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. "ఇన్నాళ్లు మన గోడు విన్నవాడు, ఇప్పుడు మన గ్రామానికి సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది?" అన్న చర్చే ఇప్పుడు కూనవరంలో హాట్ టాపిక్.

ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయేలా వినయ్ ప్రసాద్ కు యువత, మహిళల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి కూనవరం ప్రజలు కలం పట్టిన వాడిని గెలిపిస్తారా? లేక అనుభవం ఉన్న నేతల వైపు మొగ్గు చూపుతారా? ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR