Kunavaram: గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరీ!
Kunavaram: పోలవరం జిల్లా కూనవరం మండలం రేపాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం.
Kunavaram: గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరీ!
Kunavaram: కూనవరం మండలం రేపాక లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు వెట్టిచాకిరీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించుకుంటున్నారు.
వాలీబాల్ కోర్ట్ కోసం అడివిలో మొద్దులు విద్యార్థులతో నరికించి వారితోనే పాఠశాలకు మోపిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు చదువుకోసం పిల్లలను పాఠశాలకు పంపిస్తే మొద్దులు మోపించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది పై చర్యలు చేపట్టాలంటూ తల్లిదండ్రుల కోరుతున్నారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో మొద్దులు మోపించిన విషయం తెలుసుకున్న బాలల హక్కుల కమీషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు పాఠశాల ఉపాధ్యాయుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో మొద్దులు మోపించడం నేరం అని ఈ విషయం పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.




