Polavaram: పోలవరం మండల అధ్యక్ష పదవి రేసులో మైగాపుల విజయదుర్గ

Polavaram: ఏలూరు జిల్లా పోలవరం మండల అధ్యక్ష పదవి రేసులో కొత్త పట్టిసీమ ఎంపీటీసీ అభ్యర్థిని, మాజీ ఉత్తమ సర్పంచ్ మైగాపుల విజయదుర్గ ముందంజలో ఉన్నారు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 2 Nov 2026 8:04 PM IST
Polavaram
X

Polavaram: పోలవరం మండల అధ్యక్ష పదవి రేసులో మైగాపుల విజయదుర్గ

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఈనెల 5వ తారీఖున జరుగు ఎన్నికలకు ఇటు కూటమి ప్రభుత్వం మరియు ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాడి వేడి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అయితే ప్రధానంగా కొత్త పట్టిసీమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మైగాపుల విజయదుర్గ వైపు ప్రజలు చూస్తున్నారు.

గతంలో సర్పంచ్ గా ఊరి అభివృద్ధిని మండలం దాటి జిల్లా వరకు చాటి చెప్పి ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డును కలెక్టర్ చేతుల మీదుగా పొంది గ్రామ అభివృద్ధిని ఎల్లలు దాటించారు తన భర్త మైగాపుల దుర్గాప్రసాద్ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ తనదైన శైలిలో ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా పేరుందిన ఘనత ఆయనది.

పోలవరం ఏటిగట్టు పరివాహక ప్రాంతాల్లో ఎవరు కాలం చేసిన వారి దహన సంస్కారాలు చేయడానికి సరైన వసతులు లేక పక్క మండలాలకు వెళ్లే దీనస్థితి నుండి కొత్త పట్టిసీమలో దహన సంస్కారాలు చేయడానికి స్మశాన వాటిక నిర్మించి ప్రజల మన్నలు పొందారు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మైగాపుల విజయదుర్గ ఎంపీటీసీ గా గెలుపొంది పోలవరం మండల అధ్యక్షుని పీఠాన్ని ఎక్కాలని ప్రజలు భావిస్తున్నారు.

సర్పంచ్ పదవే కాక మండల అధ్యక్షుడు పదవి కూడా చేపట్టాలని కొత్త పట్టిసీమ ఓటర్లు భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఊరిని అభివృద్ధి పథంలో నడిపించిన వారే మండల అధ్యక్షునిగా వస్తే మండలం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. అభివృద్ధి చేసిన నాయకులకే పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM