Rampachodavaram: రాజకీయ విధేయతలు వీడి.. హక్కుల పోరాటానికి మాల నాయకులు రావాలి!
Rampachodavaram: రంపచోడవరంలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నకుమార్ ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు
Rampachodavaram: రాజకీయ విధేయతలు వీడి.. హక్కుల పోరాటానికి మాల నాయకులు రావాలి!
Rampachodavaram: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. పోలవరం జిల్లా, రంపచోడవరంలో బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మొదట కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అమలు చేయగా, అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసిందని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ వల్ల కొద్ది వర్గాలకే ప్రయోజనం చేకూరుతుందని, దేశంలోని 1,108 ఎస్సీ కులాలకు సమానంగా న్యాయం ఎలా జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ ఉపకులాల మధ్య అవకాశాల పంపిణీ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాలు వివరించాలని కోరారు.
మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు స్పందించడం లేదని వారు విమర్శించారు. రాజకీయ పార్టీలకు విధేయత చూపే బదులు సమాజ ప్రయోజనాల కోసం మాల నాయకులు ముందుకు రావాలని, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన ఉద్యోగులు కూడా సమాజ సమస్యలపై స్పందించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, తమ హక్కుల పరిరక్షణ కోసం శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి అందరూ సిద్ధం కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మైలే పండు, చెక్కా మోహన్‌రావు, సియాద్రి శ్రీనివాసరావు, వేచలపు గంగాధర్, వరలక్ష్మి, కొప్పుల ప్రేమ్‌బాబు, దారా నూకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.




