Eluru: పోలవరం గ్రామ పంచాయతీ రికార్డుల సీజ్.. విచారణకు గ్రామస్తుల డిమాండ్
Eluru: ఏలూరు జిల్లా పోలవరం గ్రామ పంచాయతీలో రూ. 2 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Eluru: పోలవరం గ్రామ పంచాయతీ రికార్డుల సీజ్.. విచారణకు గ్రామస్తుల డిమాండ్
ఏలూరు: అప్ ల్యాండ్ టైమ్స్ ప్రతినిధి పోలవరం ఆగస్టు 7 ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామ పంచాయతీలో సుమారు రెండు కోట్లకు పైగానే అవినీతి జరిగిందంటూ పైడిపాక నిర్వాసిత గ్రామస్తుడు తెలగం శెట్టి రాము అను వ్యక్తి స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు రికార్డులు సీజ్ చేసి పట్టికెళ్ళిన సంఘటన విధితమే.
పోలవరం పంచాయతీలో 2021 నుండి 2025 వరకు పంచాయతీ రికార్డులు సొమ్ము చూపించకుండా తమ ఇష్టారాజ్యంగా కోట్లాది రూపాయలు తమ ఇష్టం వచ్చినట్లు పంచాయతీ సెక్రటరీలు, బిల్లు కలెక్టరు, కంప్యూటర్ ఆపరేటర్ వాడుకున్నరు అంటూ పైడిపాక గ్రామస్తుడు తెలగంశెట్టి రాము ఫిర్యాదుదారుడు స్పందనలో ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత 90 రోజులు వ్యాధి ఉండడంతో ఆ పంచాయతీ అధికారులు మేము తప్పులు చేసాం మమ్మల్ని వదిలేయండి మేము మీకు ఏమైనా ఇస్తామని అంటూ ఫిర్యాదుదారుని దగ్గరికి లాబింగ్ చేసినను ఫిర్యాదుదారుడు తెలగం శెట్టి రాము ఒప్పుకోలేదు.
కొన్ని పేపర్లలో వార్త రూపంలో పెట్టడంతో అధికారులలో కదలిక వచ్చింది. వెంటనే రికార్డులను సీజ్ చేసి జంగారెడ్డిగూడెం డిఎల్పిఓ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ రికార్డులు పరిశీలించడం నత్తనడకన సాగడంతో మళ్లీ ఫిర్యాదుదారుడు స్పందనలో ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడనుండి డి ఎల్ డి వో కార్యాలయానికి ఈ రికార్డులు చేరుకున్నాయి. అక్కడ సుమారు రెండు నెలలుగా ఈ రికార్డులను పరిశీలిస్తున్నామని డి ఎల్ డి వో చెబుతున్నారు.
అసలు పంచాయతీ కార్యాలయంలో సొమ్ము తీయాలంటే ప్రతి చెక్కుపై చెక్ పవర్ ఉన్న సర్పంచ్ సంతకం ఉండాలి, కానీ సర్పంచ్ కు మాత్రం నాకేమీ తెలియదు అంటూ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని పోలవరం గ్రామస్తులు అంటున్నారు. పోలవరం నియోజకవర్గం లో అతి పెద్ద పంచాయతీ పోలవరం పంచాయతీ అధికారులకు పాడికుండ... ఈ పంచాయతీలో 2012 నుండి 2025 వరకు సుమారు పంచాయతీకి ఏరియర్స్ సొమ్ము 60 లక్షలు గా గుర్తించి బదిలీపై వెళ్లిన వై కొండల రావు సెక్రటరీ ప్రస్తుతం ఉన్న సెక్రటరీ లక్ష్మీనారాయణ కు బాధ్యతలు అప్ప చెప్పినట్లు తెలిసింది.
అప్పటి ఇంచార్జ్ ఎంపీడీవో 10 టీములుగా ఏర్పాటు చేసి ఆ సొమ్మును సచివాలయం సెక్రటరీలకు, పంచాయతీ సిబ్బందిని టీములుగా ఏర్పాటు చేసి పోలవరం పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు చేశారు. వసూలు చేసిన ఆ సొమ్ము ఏ సంవత్సరం ఎంత వచ్చింది, ఎంత కట్టించుకున్నారు, ఎంత ప్రభుత్వానికి కట్టారు , ఇంకా ఎంత కట్టాలన్న విషయం మాత్రం గోప్యంగా ఉంచడం పట్ల ఆ సొమ్ములో కూడా అవినీతి జరిగినట్లుగా గ్రామస్తులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
. అసలు పోలవరం పంచాయతీలో సంవత్సర ఆదాయం ఎంతో కూడా తెలియకుండా, రికార్డు లేకుండా ఇక్కడ పంచాయతీ అధికారులు పనిచేయడం దీనిని ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, ప్రతి సంవత్సరం యధావిధిగా ఆడిట్ జరిగిపోవడం చూస్తుంటే వీటిలో ఉన్న అధికారులకు కూడా కీలక పాత్ర మరియు వాటాలు ఉన్నట్లుగా పోలవరం పంచాయతీ ప్రజలు అనుమానిస్తున్నారు. ప్రజాధనాన్ని కాపాడాలని పంచాయతీలో పనిచేసిన చిన్న చేప నుండి తిమింగళం వరకు పట్టుకోవాలని తద్వారా ప్రగతికి పట్టం కట్టాలని అవినీతి నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.




