Eluru: ఏలూరులో ఘనంగా ప్రారంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!
Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేయర్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
Eluru: ఏలూరులో ఘనంగా ప్రారంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!
Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులను సత్కరించడంతో పాటు, గండికోట రాజేష్ బృందం ప్రదర్శించిన స్వాగత నృత్యం ఆకట్టుకుంది. మధ్యాహ్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ – సుస్థిర అభివృద్ధి అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు,కార్పొరేటర్ మోతుకూరి సీతా నాగేశ్వరరావు, పలువురు ప్రముఖులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రంథాలయ సిబ్బంది,పాఠకులు పాల్గొన్నారు.




