Ravulapalem: దళారీ వ్యవస్థకు తావు లేకుండా రైతులకు మేలు చేయాలి

Ravulapalem: రావులపాలెం అరటి మార్కెట్ యార్డును సందర్శించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 5 May 2026 3:28 PM IST
Ravulapalem
X

Ravulapalem: దళారీ వ్యవస్థకు తావు లేకుండా రైతులకు మేలు చేయాలి

Ravulapalem: రావులపాలెం అరటి మార్కెట్ యార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం ఆయన రావులపాలెం అరటి మార్కెట్ యార్డు ను సందర్శించారు. ముందుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం యార్డులో సమస్యలను పరిశీలించారు. రైతు బజార్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తదుపరి కొత్తపేట మార్కెట్ కమిటీ సమావేశంలో జిల్లా అధికారి ఏ డి ఏ విశాలాక్షి, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు, వైస్ చైర్మన్ కంఠంశెట్టి శ్రీనివాసరావు మరియు పాలకమండలి సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ కార్యవర్గం రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. పుంత రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు రావులపాలెం మార్కెట్ యార్డ్ అత్యంత కీలకమైన యార్డ్ అన్నారు. అరటి మార్కెట్ అంటేనే ఏ రోజు వ్యాపారం ఆరోజు జరిగిపోవాలన్నారు. రైతులు, సైకిల్ వెండర్లు, ఎగుమతి దారులు,ఎక్కడెక్కడ నుంచో వ్యాపారస్తులు వస్తారన్నారు. రోజుకి 40,50 లారీలు లోడై అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతాయన్నారు. 35 ఏళ్ల క్రితం అంతా దళారుల రాజ్యమే ఉండేదన్నారు.

ధర దళారులు చెప్పిన రేటుకే కొనాలి, వాళ్ళ అమ్మమన్న రేటుకే అమ్మాలి, రైతులను కొట్టిన సందర్బాలు సైతం ఉన్నాయన్నారు. రైతుల మేలు కోసం అటువంటి సందర్భంలో యార్డు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రస్తుతం యార్డులో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, శానిటేషన్ బాగుండడం లేదన్న మాటలు వినబడుతున్నాయన్నారు.

సమస్యలన్నింటినీ పరిష్కరించి మార్కెట్ యార్డును అభివృద్ధి పరచాలన్నారు. రైతు బజారు నిర్మించి, బాగా అభివృద్ధి చేయాలన్నారు. కూరగాయలు పంటకు మన ప్రాంతంలో ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, కూరగాయలు ఎక్కువగా పండించడం వల్ల రైతులకు ఆదాయం వస్తుందన్నారు. రైతులకు సైతం డిమాండ్ ఉన్న కూరగాయల పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA

Next Story