Kothapeta: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఎమ్మెల్యే బండారు

Kothapeta: కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 12 Jun 2026 3:44 PM IST
Kothapeta
X

Kothapeta: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఎమ్మెల్యే బండారు

Kothapeta: అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తేనే ప్రజల సమస్యలకు సమగ్ర పరిష్కారం లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే బండారు స్వయంగా ప్రజలతో మమేకమై వారి వద్ద నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటూ, వారి అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని, వెంటనే చర్యలు తీసుకోవాలనే సంకల్పాన్ని ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతిబింబిస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 24 వినతులు వచ్చాయి.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA

Next Story