Polavaram: శ్రీను మృతి టీడీపీకి తీరని లోటు.. ఎమ్మెల్యే శిరీషాదేవి
Polavaram: పోలవరం జిల్లా అడ్డతీగలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త సలాది శ్రీను అకాల మృతి చెందారు.
Polavaram: శ్రీను మృతి టీడీపీకి తీరని లోటు.. ఎమ్మెల్యే శిరీషాదేవి
Polavaram: పోలవరం జిల్లా అడ్డతీగలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త సలాది శ్రీను అకాల మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. అడ్డతీగలలో మంగళవారం అడ్డతీగల మండల పార్టీ అధ్యక్షులు జర్తా వెంకట రమణారెడ్డి సౌజన్యంలో ఆయన మృతదేహంపై పార్టీ జెండా, పుష్ప గుచ్చం ఉంచి నివాళి అర్పించారు.
సలాది శ్రీను ఇటీవల కాలంలో స్వల్ప అనారోగ్యానికి గురై కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆమె హుటాహుటీన ఆయన గృహానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మృతిపై దిగ్బ్రంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో మంచి క్రమశిక్షణ గల కార్యకర్త అన్నారు. ఆయన మృతితో అడ్డతీగల తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆయన కుటుంబాన్ని పరామర్శించిన ఆమె అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.మరణించిన సలాది శ్రీను గంగవరం మండలం సొసైటీ అధ్యక్షులు పాము అర్జున్ కి మేనల్లుడు కూడా కావటంతో ఇటు అడ్డతీగల మొల్లేరు వాసులు ఆయన మృతిపై సంతాపం తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, గంగవరం సొసైటీ అధ్యక్షులు పాము అర్జున్,
గంగవరం మండలం మాజీ జడ్పీటీసీ పాము సూర్యకాంతం, రాష్ట్ర రైతు విభాగ నాయకులు కనిగిరి రాంబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వప్న కుమారి, ఆడారి నాగబాబు, జారగెడ్డ మాణిక్యాల రావు, బీరా బాలయోగి, చెక్క వీరలక్ష్మి, చిట్టోజి బాపనమ్మ, కింగు మహంతి సురేష్, బీర వెంకటలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు దoగేటి సత్తిబాబు తదితరులు ఉన్నారు.




