Chintalapudi: చింతలపూడిలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ.. ఎమ్మెల్యే రోషన్

Chintalapudi: ఈనెల 15న చింతలపూడి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 13 Jun 2026 8:47 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడిలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ.. ఎమ్మెల్యే రోషన్

Chintalapudi: రెండేళ్ల విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించాలి,ఎమ్మెల్యే రోషన్ కుమార్ నేతృత్వంలో ఏర్పాట్ల పై కూటమి నాయకులు సన్నాహాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 15వ తేదీన నియోజవర్గ స్థాయిలో చింతలపూడి మార్కెట్ యార్డ్ లో నిర్వహించనున్న విజయోత్సవ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలుగుదేశం ,జనసేన, భారతీయ జనతా పార్టీల నియోజవర్గ స్థాయి కన్వీనర్లు, మండల పట్టణ స్థాయి నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోషన్ కుమార్ మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం ముఖ్యం గా తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఫలాలు రానున్న కాలంలో ప్రజలకు అందుతాయి అన్నారు.

15వ తేదీ ఉదయం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించే విజయోత్సవ సభకు ప్రతి గ్రామం నుండి కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు తరలి రావాలని జనసేన కన్వీనర్ మేక ఈశ్వరయ్య, బిజెపి కన్వీనర్ ఒంటెద్దు ప్రసాద్, టిడిపి జిల్లా పార్టీ కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాసరి శ్యాంసుందర్ శేషు మరియు నియోజకవర్గ మండలాల, పట్టణ కూటమి పార్టీల అధ్యక్షులు తదితరులు పిలుపునిచ్చారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

Next Story