Amalapuram: అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ప్రగతి ప్రస్థానం

Amalapuram: అమలాపురంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ.

RAJU, P GANNAVARAM
Published on: 19 Jun 2026 9:33 PM IST
Amalapuram
X

Amalapuram: అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ప్రగతి ప్రస్థానం

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కాపు కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమం జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకారం మరియు మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో విజయపథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచుతూ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు మూడు నెలలు కలిపి రూ.7,000 చొప్పున అందజేసినట్లు గుర్తు చేశారు.

వ్యవసాయ రంగంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే “తల్లికి వందనం” పథకం కింద ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం అంతరం పశుసంవర్ధక శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించడం జరిగింది. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి కేవలం రూ.5కే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు, శాసన మండల సభ్యులు,పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story