Chintalapudi: చింతలపూడిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభం!
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో బసవతారకం ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు.
Chintalapudi: చింతలపూడిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభం!
Chintalapudi: చింతలపూడి నగర పంచాయతీ ఆంతోని నగర్ సమీపంలోని లోటస్ హాస్పిటల్ ప్రాంగణంలో మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ, చింతలపూడి లయన్స్ క్లబ్ మరియు లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్య నిపుణుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని గౌరవ చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణకు తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు చింతలపూడికి వచ్చి ప్రజల ముంగిట ఉచితంగా స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, లోటస్ హాస్పిటల్ వైద్యులు,నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




