Eluru: ఏలూరులో ఘనంగా ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్-2026’!
Eluru: ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా 'నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్-2026' అవగాహన సదస్సు, క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు.
Eluru: ఏలూరులో ఘనంగా ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్-2026’!
Eluru: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు ఈగల్ డిపార్ట్మెంట్,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), 'మై భారత్' సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
యువత గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్ఐ బి.ఉదయ భాస్కర్ పిలుపునిచ్చారు.శారీరక,మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే వ్యసనాలకు బానిసలు కాకుండా చదువు,క్రీడలపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే ఈగల్ డిపార్ట్మెంట్ హెల్ప్‌లైన్ '1972' లేదా పోలీస్ హెల్ప్‌లైన్ '112' నెంబర్లకు సంప్రదించాలని అధికారులు కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు యోగా,స్కిప్పింగ్,టగ్ ఆఫ్ వార్,గోనె సంచి పరుగు వంటి క్రీడా పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు,క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ గిర్రెడ్డి, వెయిట్‌లిఫ్టింగ్ ఆసియా రజత పతక విజేత ఎ. శ్రీనివాసరావు, డీఎస్డీఓ అజీజ్,యోగా శిక్షకులు,స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది పాల్గొన్నారు. "మాదకద్రవ్యాలకు నో చెప్పండి..ఫిట్‌నెస్‌కు యెస్ చెప్పండి!" అనే నినాదంతో ఆరోగ్యకరమైన వికసిత భారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని అధికారులు ఆకాంక్షించారు.




