Eluru: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

Eluru: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. 10,577 కేసులు గుర్తించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి వెల్లడి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Sept 2026 9:48 PM IST
Eluru
X

Eluru: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

ఏలూరు: ఈనెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి యస్. శ్రీదేవి తెలిపారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 10,577 రాజీయోగ్యమైన కేసులను గుర్తించామని, వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

గత జాతీయ లోక్ అదాలత్‌లో 7,910 కేసులు పరిష్కరించామని తెలిపారు.కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని,లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్. శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story