Velairpadu: వేలేరుపాడులో బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు!

Velairpadu: వేలేరుపాడు టీడీపీ కార్యాలయంలో అనారోగ్య బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కులను కూటమి పార్టీల నేతలు మంగళవారం అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Sept 2026 7:49 PM IST
Velairpadu
X

Velairpadu: వేలేరుపాడులో బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు!

వేలేరుపాడు: అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్.) ఆర్థిక సహాయం అందింది. వేలేరుపాడు మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రుద్రంకోట గ్రామానికి చెందిన మెండెం రాములు, వేలేరుపాడు గ్రామానికి చెందిన వేల్పూరి జయరాజు కుటుంబాలకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేశారు.

టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సారె బాబ్జి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.

వైద్య ఖర్చులకు ఆర్థిక భరోసా..

వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన సహాయం కొంత ఉపశమనం కలిగించనుంది. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివరామ్, భాను సాయి,వంశి, టిడిపి నాయకులు ఐటిడిపి మండల అధ్యక్షులు ఎండి నకీమ్ నయీమ్, అమరవరపు వెంకన్న, బాబ్జి, కరుటూరి రాధాకృష్ణ, పూనెం రామారావు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్