Amalapuram: DROగా వి.సుబ్బారావు.. కలెక్టర్ మహేష్ కుమార్ కీలక సూచనలు!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నూతన రెవెన్యూ అధికారిగా (DRO) వి. సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

PRABHU, RAZOLE
Published on: 4 May 2026 12:27 PM IST
Amalapuram
X

Amalapuram: DROగా వి.సుబ్బారావు.. కలెక్టర్ మహేష్ కుమార్ కీలక సూచనలు!

అమలాపురం జిల్లా: అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూశాఖ కీలక పాత్ర పోషిస్తోందని, నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు జిల్లాలోని అన్ని విభాగాలతో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ కోనసీమ ​జిల్లా పాలనాంశాలు, రెవెన్యూ విభాగం పనితీరుపై జిల్లా కలెక్టర్ ఆయనకు దిశానిర్దేశం చేశారు. విధులు, బాధ్యతలు పట్ల నిబద్ధతగా వ్యవహరించి జిల్లాను రెవెన్యూ అంశాలలో రాష్ట్రంలో ముందంజలో నిలపాలని సూచించారు.

అనంతరం ఆయన జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి మాట్లాడుతూ..నూతన డిఆర్ఓ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. నూతన డిఆర్ఓ మాట్లాడుతూ... జిల్లా రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ​జిల్లా అభివృద్ధిలో తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని నూతన డి.ఆర్.ఓ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story